Movies

రంకెలేసిన రజనీ

Superstar  Rajinikanth Super Angry On Palani Govt

పళని స్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే సర్కారుపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఒంటికాలిపై లేచారు. మళ్లీ అధికారం అనేది మీకు కల్ల’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ మద్యం దుకాణాలు తెరవాలంటూ పళని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని రజనీకాంత్ పై వ్యాఖ్యలు చేశారు. మద్యం దుకాణాలను మూసేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా స్టే కోరుతూ పళని సర్కార్ సుప్రీం మెట్లెక్కాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రజనీకాంత్ స్పందించారు. ‘‘ఈ క్లిష్ట సమయంలో సర్కారు మద్యం దుకాణాలను తెరవాలని నిర్ణయిస్తే మాత్రం మళ్లీ అధికారంలోకి రావడం కలే అవుతుంది. ఆదాయ మార్గాల కోసం దయచేసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి.’’ అంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు.