ఇది కేవలం అపోహే! ఎండాకాలంలో కొందరికి ఆకుకూరలు తిన్నప్పుడు రక్తంతో కూడిన జిగట విరోచనాలు అవుతాయి. ఈ.కొలై లాంటి కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల ఈ సమస్య ఉత్పన్నం కావొచ్ఛు అలాగే పీచు పదార్థం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఇలా జరగొచ్ఛు మట్టి, ఇసుకతోపాటు కొన్ని రకాల బ్యాక్టీరియా ఆకుకూరలను అంటిపెట్టుకుని ఉంటాయి. కొన్ని ఎరువుల అవక్షేపాల వల్ల కూడా ఇలా జరగొచ్ఛు సరిగ్గా ఉడికించకుండా పచ్చివిగా వాడినప్పుడూ ఇలాంటి సమస్యలు రావొచ్ఛు ఈ కారణాల వల్ల ఒక్కోసారి విరోచనాలు కావొచ్ఛు ఈ సమస్యను అధిగమించాలంటే.. ఆకుకూరలను ధారగా నీళ్లు పోస్తూ శుభ్రంగా కడగాలి. మట్టి, ఇసుక, మిగిలిన వ్యర్థాలు పోయేలా నీటిని ఎక్కువగా పోస్తూ కడగాలి. బాగా ఉడికించాలి.
ఆకుకూరలు తింటే జిగట విరేచనాలు అవుతున్నాయా?
Related tags :