కరోనా వైరస్‌కు టీకాను అభివృద్ధి చేయడానికి సాగుతున్న పరిశోధన వివరాలను చైనాకు చెందిన హ్యాకర్లు తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, సైబర్ సెక్యూరిటీ నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు టీకాల అభివృద్ధి కోసం తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది. కొవిడ్-19కు చేసే చికిత్సలు, పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని, మేధో సంపదను చోరీ చేసేందుకు కూడా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ విమర్శలను చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్ ఖండించారు.
కరోనా వ్యాక్సిన్ వివరాలు హ్యాక్ చేస్తున్న చైనా
Related tags :