Business

టికెట్ కోసం బంగారం అమ్మకం

Indian Labor In Gulf Selling Gold For Flight Tickets

యూఏఈలో ఉంటున్న భారత వలస కార్మికులు, చిరుద్యోగులు స్వదేశానికి వచ్చేందుకు విమాన టిక్కెట్ల కోసం తమ దగ్గరున్న బంగారం అమ్మేస్తున్నారు. కొవిడ్‌ ప్రభావంతో అకస్మాత్తుగా ఉపాధి కోల్పోవడం, జీతాల్లో కోతలతో చాలామంది చేతిలో సరిపడా డబ్బులేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మే 7 నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభమవడంతో ఒక్కసారిగా వీరి బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి. దుబాయ్‌లోని మీనాబజార్‌, డేరా ప్రాంతాల్లోని చిన్నచిన్న బంగారు దుకాణాలలో ఎక్కువగా ఇలాంటి లావాదేవీలే జరుగుతున్నాయి. ఇక్కడ నివాసం ఉంటున్న పెద్ద కంపెనీల ఉద్యోగులు సైతం తమ కుటుంబసభ్యులను స్వదేశానికి పంపిస్తున్నారు. వీరంతా తమ బంగారాన్ని భారత్‌కు వచ్చాక అమ్ముకుంటే 10-12 శాతం ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నా.. ప్రస్తుతానికి చేతిలో డబ్బు ఉండటమే ముఖ్యమని భావిస్తున్నారు. దుబాయ్‌లో సోమవారం 22 క్యారెట్ల గ్రాము బంగారం 193.50 దిర్హమ్‌లు(రూ.3,963) పలికింది.