ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘‘రాష్ట్రాల రుణాలను రీషెడ్యూల్ చేసి రుణ పరిమితిని పెంచాలి. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి. జులై, ఆగస్టు నెలల్లో కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. భారత్ నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
రుణాలు పెంచండి. రైళ్లు ఆపండి.

Related tags :