భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు అధికారులు క్వారంటైన్ స్టాంప్ వేశారు. 28 రోజులపాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని ఆయనకు సూచించారు. సోమవారం గోపీచంద్ అనుమతులతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం తెలంగాణ సరిహద్దు తనిఖీ కేంద్రం మీదుగా ప్రయాణిస్తున్న ఆయన కారును అధికారులు నిలువరించారు. అనంతరం గోపీచంద్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు లేనప్పటికీ నిబంధనల ప్రకారం 28 రోజులపాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని ఆదేశిస్తూ క్వారంటైన్ స్టాంప్ వేసినట్లు కోదాడ మండల వైద్యాధికారి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు.
గోపీచంద్‌కు 28రోజుల క్వారంటైన్
Related tags :