Movies

ఎక్కడున్నావమ్మా….ఓ సన్నీ ముద్దుగుమ్మా!

Sunny Leone Shuffling Between Countries

కరన్‌జిత్‌ కౌర్‌ అమెరికాలో తన పిల్లలతో హాయిగా మెట్లమీద కూర్చుని ఉన్న ఓ చిత్రాన్ని మాతృదినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అయితే ఏంటి అంటున్నారా? కరన్‌జిత్‌ కౌర్‌ మరెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌. మాతృదినోత్సవానికి ఒక్క రోజు ముందు, తాను ముంబయిలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో వర్కవుట్లు చేస్లున్నట్టు, తన చిన్నారులను షికారుకు తీసుకెళ్లినట్టు ఉన్న వీడియోలను సన్నీ సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. దీనితో తను భారత్‌లోనే ఉందని అందరూ భావించారు. అంతలోనే అమెరికాలో ఉన్న చిత్రాన్ని విడుదల చేయటంతో… ఇదెప్పుడబ్బా అని నెటిజన్లు తెగ హాశ్చర్యపోతున్నారు.