DailyDose

LG పాలీమార్స్ చుట్టుపక్కల పండిన కూరగాయలపై నిషేధం-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Veggies Banned Around LG Polymers Vizag

* భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గుండె నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మన్మోహన్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ ను ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, చికిత్సకు సహకరిస్తున్నారని పేర్కొంది. మన్మోహన్ కు గుండె నొప్పి రావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని, ప్రస్తుతం ఆయన్ని అబ్జర్వేషన్ లో ఉంచామని అన్నారు. కాగా, నిన్న రాత్రి సమయంలో మన్మోహన్ సింగ్ కు ఛాతీలో నొప్పి రావడంతో ఎయిమ్స్ కి తరలించారు. ఎయిమ్స్ లోని కార్డియో వాస్క్యులర్ సెంటర్ లో చికిత్స కొనసాగుతోంది.

* విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో స్టైరీన్‌ ప్రభావానికి గురైన వ్యక్తులు ఏడాది పాటు వైద్య పరీక్షలు చేయించుకోవాలని క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణుల బృందం తన సిఫార్సుల్లో పేర్కొంది. సమీప ప్రాంతంలో పండిన కూరగాయలు, పండ్లను కూడా వినియోగించొద్దని ప్రజలకు సూచించింది. ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎస్‌ఐఆర్‌- ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణుల బృందం ఓ నివేదిక రూపొందించింది. సంబంధిత నివేదికను కేంద్రానికి పంపించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ బృందం పరిశ్రమ సమీపంలోని రహదారులు, ఇళ్లలో స్టైరీన్‌ అవశేషాలు గుర్తించింది. ఒక నివాసంలో అత్యధికంగా 1.7 పీపీఎం స్టైరీన్‌ను గుర్తించినట్లు తన నివేదికలో ఈ బృందం ప్రస్తావించింది.

* కరోనా నేపథ్యంలో మద్యం విక్రయాలు జరపడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మాతృభూమి ఫౌండేషన్‌తో పాటు మరొకరు వేసిన పిటిషన్లపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది. కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దుకాణాలకు అనుమతివ్వడం సరైన చర్య కాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదించారు. మద్యం షాపుల వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మద్యం తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందన్నారు.

* కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపట్నుంచి 15 ప్రత్యేక రైళ్లు నడపాలన్న కేంద్రం ఆదేశం మేరకు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వసూలు చేస్తున్న ఛార్జీలనే.. ఇప్పుడు నడిపే ప్రత్యేక రైళ్లకు కూడా వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జోనల్ మేనేజర్లకు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే బోర్డు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది.

* దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. ఈ విశ్వ మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ -3 మరో ఆరు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. గడిచిన 24గంటల్లోనే రికార్డు స్థాయిలో 4200 కేసులు నమోదవ్వడంతో దీన్ని కట్టడి చేసే వ్యూహంపై చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఐదోసారి జరుగుతున్న ఈ కీలక వీడియో కాన్ఫరెన్స్‌ రెండు సెషన్ల వారీగా నిర్వహించనున్నారు.

* విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో స్టైరీన్‌ ప్రభావానికి గురైన వ్యక్తులు ఏడాది పాటు వైద్య పరీక్షలు చేయించుకోవాలని క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణుల బృందం తన సిఫార్సుల్లో పేర్కొంది. సమీప ప్రాంతంలో పండిన కూరగాయలు, పండ్లను కూడా వినియోగించొద్దని ప్రజలకు సూచించింది. ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎస్‌ఐఆర్‌- ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణుల బృందం ఓ నివేదిక రూపొందించింది. సంబంధిత నివేదికను కేంద్రానికి పంపించింది. 5 గ్రామాలు, 3 కిలోమీటర్ల పరిధిలో పండిన కూరగాయలు, పండ్లను వినియోగించరాదంది.

* రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. పెంచిన ఛార్జీలకు ‘జగనన్న విద్యుత్‌ దీవెన’ పథకం అని పేరు పెట్టుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు అండగా ఉంటే వైకాపా ప్రభుత్వం మాత్రం ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆక్షేపించారు.

* ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషి ఎనలేనిదని భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌‌ ప్రశంసించారు. వైరస్‌ పోరులో వీరు ముందుండి పోరాడుతున్న తీరు దేశానికే గర్వకారణమని కొనియాడారు. అంతేకాకుండా దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతికత ఎంతో కీలకంగా మారిందని రాష్ట్రపతి అన్నారు. నేషనల్‌ టెక్నాలజీ డే సందర్భంగా భారత రాష్ట్రపతి పౌరులకు ట్విటర్‌లో సుభాకాంక్షలు తెలిపారు.

* కరోనా నేపథ్యంలో మద్యం విక్రయాలు జరపడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మాతృభూమి ఫౌండేషన్‌తో పాటు మరొకరు వేసిన పిటిషన్లపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది. కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దుకాణాలకు అనుమతివ్వడం సరైన చర్య కాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదించారు. మద్యం షాపుల వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల చిక్కుకున్న వలస కూలీలను స్వస్థలాలకు తరలింపునకు కేంద్రం శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు ఆ రైళ్లు నిలిపే స్టాపుల్లో రైల్వేశాఖ తాజాగా మార్పులు చేసింది. బయల్దేరిన చోట నుంచి గమ్యస్థానం చేరే వరకు మూడు స్టాపుల్లో ఆపాలని నిర్ణయించింది. ప్రయాణికుల సంఖ్య కూడా 1200 నుంచి 1700లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైలు ఆగే మూడు చోట్లా అనుమతి లేకుండా ఒక్కరికి కూడా ప్రవేశం ఉండదని స్పష్టంచేసింది.

* కరోనా రోగులు నిమోనియా, గుండెపోటు, రక్తం గడ్డకట్టడం సహా మరికొన్ని ఇతర రోగాలకు దారితీసి చనిపోతేనే కొవిడ్‌-19 మరణంగా నమోదు చేయాలని ఐసీఎంఆర్‌ తెలిపింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్-19 కొత్త మహమ్మారి అని, ప్రపంచంలోని అన్ని వర్గాల వారిపై ఈ వ్యాధి ప్రభావం ఉందని ఐసీఎంఆర్‌ తెలిపింది. ప్రజారోగ్యంపై కరోనా ప్రభావం తెలుసుకొనేందుకు, ప్రణాళికలు అమలు చేసేందుకు, సరైన సమయంలో జోక్యం కోసం భారత్‌కు కచ్చితమైన సమాచారం అవసరమని వివరించింది.

* కరోనా మహమ్మారిపై పోరును కార్మికుల హక్కులను కాలరాయడానికి, వారి గొంతును అణచివేయడానికి అదునుగా భావించరాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. చాలా రాష్ట్రాలు కార్మిక చట్టాలను సవరిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సురక్షితమైన పనిప్రదేశాల్ని కల్పించే ప్రాథమిక నిబంధనల విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని హితవు పలికారు.

* కరన్‌జిత్‌ కౌర్‌ అమెరికాలో తన పిల్లలతో హాయిగా మెట్లమీద కూర్చుని ఉన్న ఓ చిత్రాన్ని మాతృదినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అయితే ఏంటి అంటున్నారా? కరన్‌జిత్‌ కౌర్‌ మరెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌. మాతృదినోత్సవానికి ఒక్క రోజు ముందు, తాను ముంబయిలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో వర్కవుట్లు చేస్లున్నట్టు, తన చిన్నారులను షికారుకు తీసుకెళ్లినట్టు ఉన్న వీడియోలను సన్నీ సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. దీనితో తను భారత్‌లోనే ఉందని అందరూ భావించారు. అంతలోనే అమెరికాలో ఉన్న చిత్రాన్ని విడుదల చేయటంతో… ఇదెప్పుడబ్బా అని నెటిజన్లు తెగ హాశ్చర్యపోతున్నారు.