ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు ప్రయత్నించడం హేయమని అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇలా చేయడం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయడమే అవుతుందన్నారు. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి తెదేపా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఆరోపిస్తున్నారనీ.. అలాంటిదేమైనా ఉంటే రుజువు చేయాలన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ విస్తరణకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన మానవ తప్పిదమేనని.. ఘటనకు సంబంధించి సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నైతిక బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎల్‌జీ పాలిమర్స్‌ను తక్షణమే అక్కడనుంచి తరలించాలన్నారు. విశాఖలో అంతా బాగానే ఉందని మంత్రులు ప్రచారం చేయడం సరికాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయసాయిరెడ్డి బాధ్యత వహించాలి
Related tags :