* గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే రోజు 76 కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడింది. జియాగూడలో 26 కేసులు నమోదు కావడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి.. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో షాపులను మూసివేయించి.. ఆశా వర్కర్లను రంగంలోకి దింపారు. ఇంటింటికి తిరిగి పరీక్షలు చేస్తున్నారు.
* కొవిడ్-19 చికిత్సలో సత్ఫలితాస్తుందని భావిస్తున్న యాంటీ-వైరల్ ఔషధం ‘ఫవిపిరవిర్’ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో కీలక దశకు చేరుకున్నాయి. మూడో దశలో భాగంగా దీన్ని కొవిడ్-19 రోగులపై పరీక్షించనున్నట్లు ‘గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్’ వెల్లడించింది. ఈ డ్రగ్‌ను పరీక్షించేందుకు గత నెల ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’(డీసీజీఐ) సంస్థకు అనుమతులిచ్చింది. ‘ఫవిపిరవిర్’ కొవిడ్-19ను నయం చేసే సామర్థ్యంపై జరుపుతున్న పరీక్షల్లో భారత్‌లో మూడో దశకు చేరిన తొలి సంస్థ తమదేనని గ్లెన్‌మార్క్ ఓ ప్రకటనలో తెలిపింది.
* నిన్నటి వరకు జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా నేడు ఒక్కసారిగా 9 కేసు లు నమోదు కావడం తో ఉలిక్కిపడ్డ జిల్లా అధికార యంత్రాంగం .నేడు నమోదు అయినా కేసులన్నీ సూళ్లూరుపేట కి చెందినవి . వీరంతా చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి కూరగాయలు మరియు పండ్లు తెచ్చి విక్రయిన్చేవారని అధికారుల సర్వేలో తెలిసింది . గతవారం కింద నెల్లూరు నగరం లోని కూరగాయల మార్కెట్ లో కొంతమంది కరోనా అనుమానంతో క్వారంటైన్ కి తరలించడం తో మొదలైన పర్వం నేడు తన సత్తా ను ఒకేరోజు తొమ్మిదిమందికి వ్యాపించడం తో జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు ,జిల్లా ఆరోగ్యశాఖాధికారి ,జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తదితరులు అందరు సూళ్లూరుపేట ప్రాంతం పై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు . ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ముక్యంగా చెన్నై నుంచి నెల్లూరు జిల్లాలో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నవారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు . సూళ్లూరుపేట ప్రాంతం లో ని సాయి నగర్, వనంతోపు ప్రాంతాలని అధికారులు రెడ్ జోన్ వుంచారన్నారు . అలాగే చెన్నై నుంచి నెల్లూరు కి వచ్చేవారిని క్షున్నంగా పరిశీలించాకే జిల్లాలో అనుమతించాలని బోర్డర్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు . ఈ కఠినతరమైన చర్యల వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగిన కూడా తప్పని సరి పరిస్థిలలో ఇలా చర్యలు తీసుకువాల్సి వచ్చిందరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడారు . అలాగే ప్రజలందరూ తప్పనిసరి పరిస్థిలలో తప్ప బయటకు రావద్దని త్తెలిపారు ఈ క్రమంలో జిల్లా లో ఇప్పటివరకు కరోనా పాజుటివ్ కేసు ల సంఖ్య 114 కి చేరండంతో జిల్లా అధికారులు ,ప్రజలు బెంబేలెత్తుతున్నారు . అనుమానితులందరిని అధికారు క్వారంటైన్ కి తరలిస్తున్నారు . అలాగే చెన్నై కోయంబేడు వ్యాపారులు ఎవరెవరితో లావాదేవీలు సాగించారని విచారణ జరుపుతున్నారు . ఏది ఏమైనప్పటికి నిన్నటి వరకు కరోనా నేపథ్యం లో కేసుల సంఖ్య తగ్గుముఖం గా వున్నా జిల్లా నేడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది .
* దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో 70,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3604 పాజిటివ్ కేసులతో పాటు 87 మంది బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2293కి చేరింది. దేశంలో ప్రస్తుతం 46,006 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 22454 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చారి అయ్యారు.
* ఆరోగ్య సేతు యాప్‌లో వ్యక్తిగత సమాచార గోప్యతపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ దీనిపై కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా ప్రజల నుంచి సేకరించే సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారు.. ఎలా షేర్ చేసుకుంటారు అనే దానిపై సరికొత్త ప్రోటోకాల్ విడుదల చేసింది.
* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్న వేళ.. కొన్ని దేశాలు ఆంక్షలను సడలిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిబంధనలను సులభతరం చేస్తున్న దేశాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్ వేగాన్ని తగ్గించడంలో కొన్ని దేశాలు సఫలం అయ్యాయని, దీని వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడారని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ టెడ్రోస్ తెలిపారు. జనీవాలో వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.