ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్… అటు గల్ఫ్ దేశాల్లో కూడా కరాళ నృత్యం చేస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకీ ఈ వైరస్ గల్ఫ్‌లో కోరలు చాస్తోంది. తాజాగా కువైట్‌లో ఓ భారత సంతతి వైద్యుడు కొవిడ్-19 వల్ల మరణించారు. వాసుదేవ రావు(54) అనే భారతీయ వైద్యుడు దుబాయిలోని జబేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలొదిలారు.15 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్న వాసుదేవ రావు.. కువైట్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కువైట్ ఆయిల్ కంపెనీలో ఎండోడాంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కువైట్‌లోని ఇండియన్ డెంటిస్ట్ అలియన్స్(ఐడీఏ) సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన మరణం తీరని లోటు అని ఐడీఏ పేర్కొంది. కాగా, భారత్ నుంచి కువైట్‌లో కొవిడ్-19 వల్ల చనిపోయిన రెండో మెడికల్ ప్రొఫెషనల్ వాసుదేవ రావు. ఇక కువైట్‌లో విజృంభిస్తున్న కరోనా వల్ల ఇప్పటివరకు 65 మంది చనిపోయారు. 9,286 మంది ఈ వైరస్ బారిన పడ్డారు
కువైట్‌లో వాసుదేవరావు మృతి
Related tags :