తన ఆరోగ్యానికి సంబంధించి తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు.
నిన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా అలర్జీ, జలుబుతో కొంచెం ఇబ్బంది పడినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా అలర్జీతో బాధపడుతున్నాని, నిన్న సిరిసిల్ల వెళ్తున్నప్పుడు మరోసారి జలుబు వచ్చిందని తెలిపారు.
ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.
‘‘కొన్ని కార్యక్రమాలు అకస్మాత్తుగా రద్దు చేస్తే చాలా మంది ఇబ్బంది పడతారు. ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నిన్న పర్యటనకు వెళ్లాను.
నా పర్యటన వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించండి’’ అని పేర్కొన్నారు.
నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి టెక్స్‌టైల్ పార్క్‌లో రూ.14.50కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ పర్యటనలో కేటీఆర్ జలుబుతో కాస్త అనారోగ్యంగా కనిపించారు.
ఈ విషయంపై ఓ అభిమాని కేటీఆర్‌ను ట్విటర్ వేదికగా ప్రశ్నించడంతో ఆయన ఈమేరకు స్పందించారు.