శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ భక్తులను అనుమతించే అంశంపై కసరత్తు మొదలైంది.
లాక్డౌన్ నుంచి పరిస్థితులు మెల్లిమెల్లిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని భావిస్తోన్న నేపధ్యంలో మరోవైపు కరోనా వైరస్ ఇప్పుడప్పుడే మానవాళిని వదిలిపోయే అవకాశం లేదని ప్రకటిస్తున్న ప్రభుత్వాలు వాటితో కలిసి జీవించడం నేర్చుకోవాలని చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే మెల్లిమెల్లిగా లాక్డౌన్ కారణంగా మూతపడ్డ వ్యవస్థలను తిరిగి తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో దేవాలయాలు కూడా ఉన్నాయి.