Agriculture

ఏపీ-తెలంగాణాల్లో వర్షాలు

Rains Forecasted For AP TG-Telugu Agricultural News

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
16న అండమాన్‌కి నైరుతి రుతుపవనాలు
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది.
దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా లాక్‌డౌన్ వల్ల… రవాణా లేకపోవడం, ఫ్యాక్టరీలు మూతపడటంతో…
గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల మోతాదు
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది.
దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా లాక్‌డౌన్ వల్ల… రవాణా లేకపోవడం, ఫ్యాక్టరీలు మూతపడటంతో…
గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల మోతాదు తగ్గింది.
అందువల్ల వాతావరణంలో వేడి తగ్గింది. ఫలితంగా నైరుతీ రుతుపవనాలు త్వరగా వచ్చేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలో మే 16న నైరుతీ రుతుపవనాలు… అండమాన్ నికోబార్ దీవుల్ని చేరబోతున్నాయి. నాలుగు రోజుల ముందే వస్తున్నాయి.
కాగా.. మే 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది.
అది మూడ్రోజుల్లో బలంగా మారి… మధ్య బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఫలితంగా వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఏర్పడనుంది.
ఇక… మహారాష్ట్రలోని విదర్భ నుంచి మొదలై… తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు వరకూ విస్తరించి ఉన్న ఉపరితలద్రోణి కారణంగా కోస్తా, రాయలసీమలో సోమవారం కొన్నిచోట్ల వర్షాలు పడ్డాయి.
రానున్న 3 రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని..
తెలంగాణలో కూడా మంగళ, బధువారం అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.