అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో కరోనా రాజధానిగా ఉన్న కర్నూలు నగరంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నర్సులపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తరఫున పూలవర్షంతో సత్కరించారు. పొట్లూరి రవి సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులను స్థానికులు అభినందించారు. కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న వైద్య ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా రవి ధన్యవాదాలు తెలిపారు.
కర్నూలు నర్సులపై తానా పూలవర్షం
Related tags :