రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ జలవనరులశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం వంటి ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు లేనిపరిస్థితి నెలకొంది. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కేటాయింపులు దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకోదు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నీటి కేటాయింపులు చేస్తుంది. పరిధి దాటి నీటిని తీసుకోవడానికి బోర్డు కూడా అంగీకరించదు’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
మాకు అదనం వద్దు
Related tags :