సినీ పరిశ్రమలో అతి పెద్ద పండుగ ఆస్కార్‌పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది.
కరోనా వలన ఇప్పటికే అకాడమీ రూల్స్ మారుస్తున్నట్టు కొద్ది రోజులు క్రితం ప్రకటించగా, తాజాగా ఆస్కార్ అవార్డుల పండుగని వాయిదా వేయబోతున్నట్టు తెలుస్తుంది.
లాక్ డౌన్ వలన థియేటర్స్ అన్నీ మూతపడడంతో పలు భారీ చిత్రాలు విడుదలకి నోచుకోలేకపోయాయి.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగాల్సిన ఆస్కార్ అవార్డుల వేడుక వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇంగ్లీష్ మీడియా చెబుతుంది.
లాక్ డౌన్ వలన టాప్ గన్: మార్విక్, నో టైమ్ టూ డై, ములాన్, బ్లాంక్ విండో వంటి భారీ చిత్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక చిత్రాలు వాయిదా పడ్డాయి.
ఇలాంటి పరిస్థితులలో ఆస్కార్ వేడుకని ఫిబ్రవరిలో జరపడం భావ్యం కాదని భావించిన అకాడమీ వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇదే కనుక నిజమైతే 93 ఏళ్ళ ఆస్కార్ అవార్డ్ చరిత్రలో తొలిసారి వాయిదా పడడం అవుతుంది.