Politics

సొంత కార్యాలయంలో సొంత నిరాహారదీక్షలో సొంత ప్రసంగం

MP Bandi Sanjay Slams KCR And YS Jagan

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వంద్వ విధానాలను అవలంబిస్తూ తెలంగాణ ప్రజల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్‌ బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటి వరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది’’ అన్నారు.