Movies

నయన…తయారేనా?

nayanathara wedding details are here

భవిష్యత్తులో తన పిల్లలకి కాబోయే తల్లి అంటూ ప్రముఖ కథానాయిక నయనతార గురించి దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ఇన్‌స్టగ్రామ్‌లో ఓ వ్యాఖ్య చేశారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యతో, నయనతార పెళ్లికి సిద్ధమవుతోందనే ప్రచారానికి బలాన్నిచ్చినట్టైంది. నయనతార – విఘ్నేష్‌ శివన్‌ చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ తరచూ విహారం కోసం విదేశాలు చుట్టొస్తుంటారు. వీళ్లిద్దరి మధ్యనున్న బంధం త్వరలోనే పెళ్లి పీటల వరకు చేరనుందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఒక చిన్నారితో నయనతార కలిసున్న ఫొటోని ఇన్‌స్టగ్రామ్‌లో పంచుకుంటూ… ‘నా పిల్లలకి కాబోయే తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు’ అని విఘ్నేష్‌ వ్యాఖ్య జోడించడం ఆసక్తి రేకెత్తించింది. దక్షిణాదిలో అగ్ర నాయికగా కొనసాగుతోంది నయనతార.