Business

నిర్మల ప్రకటించిన కరోనా ప్యాకేజీ వివరాలు ఇవి

Nirmala Sitharaman Announces Corona Package Details In Telugu

నిర్మలా సీతరామన్ కామెంట్స్…

ఆర్థిక ప్యాకేజీ వివరాలు ప్రకటించిన నిర్మలా సీతారామన్

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు

స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రత్యేక ప్యాకేజీ
వివిధ మంత్రిత్వశాఖలతో చర్చించాక ప్యాకేజీకి రూపకల్పన

ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది

భారత్ స్వయం సమృద్ధిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ ఉపయోగం

ఎకానమీ, మౌలికరంగం, టెక్నాలజీ, వనరులపై ఫోకస్

40 రోజుల్లో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది

స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం

అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు రావాలి

పీఎం కిసాన్ యోజన వంటి పథకాల ద్వారా రైతులను ఆదుకున్నాం

ఉజ్వల వంటి పథకాలతో ప్రజలకు చేరువయ్యాం

లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ వంటి సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయి

ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే ముందు ఈ సంస్కరణలను అర్థం చేసుకోవాలి

భూమి, కార్మికులు, నగదులభ్యత, చట్టాలకు ప్రాధాన్యం

పేదలు, వలస కార్మికుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తాం

లాక్ డౌన్ తర్వాత గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ప్రకటించాం

41 కోట్ల జన్ ధన్ అకౌంట్లోకి రూ.52,606 కోట్లను నేరుగా జమచేశాం

71 వేల టన్నుల ఆహారధాన్యాలను పంపిణీ చేశాం

నగదు లభ్యత పెంచడమే మా ఉద్దేశం

ఉద్దీపన చర్యల్లో భాగంగా 15 చర్యలు ప్రకటిస్తున్నాం

చిన్న,మధ్య తరహా కంపెనీలకు రూ.3 లక్షల కోట్లు కేటాయింపు

MSME రుణాలకు కేంద్రం గ్యారంటీ

ఎలాంటి పూచీకత్తు లేకుండా ఎంఎస్ఎంఈలకు రుణాలు

అక్టోబర్ వరకు MSME లకు ఈ రుణ సదుపాయం

ఈ రుణాలకు నాలుగేళ్ల కాలపరిమితి, ఏడాది మారటోరియం

రూ.80 వేల కోట్ల విలువైన రీఫండ్స్ చేశాం