DailyDose

కళాశాల ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి-తాజావార్తలు

SV Subbareddy Elected As Chairman For University-Telugu Breaking News

* ఢిల్లీ ఎస్వీ క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ ఛైర్మ‌న్‌గా వైవి.సుబ్బారెడ్డి. సిబ్బంది నియామ‌కాల ప్ర‌క్రియ‌కు అనుమ‌తి. ఢిల్లీలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ ఛైర్మ‌న్‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజిని ఎన్నుకున్నారు.తాడేప‌ల్లిలోని ఛైర్మ‌న్ నివాసం నుంచి బుధ‌వారం ఢిల్లీ ఎస్వీ క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ స‌మావేశాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు.

* ఈనెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించడంతో పాటు,  కేంద్రం ప్రతి బిల్లులో ప్రతిపాదించిన ప్రజా వ్యతిరేక సవరణలు ఉపసంహరించాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలల్లో బిల్లులు కలిపి ఇవ్వడంతో భారీగా వచ్చాయన్నారు.సుంకాలు, ఫైన్లు పేరుతో అదనంగా వసూలు చేయడం అన్యాయమని, ఈ బిల్లులు చెల్లించలేక ప్రజలు నుంచి తీవ్ర నిరసన ప్రారంభమైందన్నారు.ప్రజలందరూ ఐక్యంగా 18వ తేదీన నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వామపక్ష నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

* తమిళనాడు రాష్ట్రాన్ని కరోనా వైరస్ ఓ కుదుపు కుదుపుతోంది. ఈ కరోనా కల్లోలం కారణంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరాన్ని కరోనా వైరస్ దిగ్బంధించింది. ఒక్క చెన్నైలోనే ఏకంగా 4900 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే సగం కేసులు ఉన్నాయి. పైగా, ఈ కరోనా వైరస్ ఐపీఎస్ అధికారులను సైతం వదిలిపెట్టడం లేదు. 

* ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ వ్యాఖ్యలు.విద్యుత్ ఛార్జీలు పెరగలేదు, గతంలో మాదిరిగానే ఉన్నాయి.500 యూనిట్లు దాటితేనే అదనంగా 90 పైసలు పెరిగింది.టారిఫ్ ఆర్డర్ తో సంబంధం లేకుండా బిల్లింగ్ చేశామనేది అవాస్తవం.వినియోగదారులు బిల్లుల వివరాలన్నీ ఆన్-లైన్ లో ఉంచుతున్నాం.ఏమైనా అనుమానాలుంటే 1912కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.ఈఆర్‌సీ ఆమోదించాకే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.బిల్లుల చెల్లింపుల గడువు జూన్ 15 వరకు పెంపు.

* నీటి పంపకాల విషయంలో కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజనీరు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన రాయలసీమ దుర్భిక్ష నివారణ ఎత్తిపోతల పథకం ప్రధానంగా చర్చకు రానుంది. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత నెలకొల్పడానికి.. వివాదాలను కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) ద్వారా పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజనీరు అధ్యక్షతన కేంద్ర జలవనరుల శాఖ ఓ కమిటీ ఏర్పాటుచేసింది.

* కువైట్‌లో చిక్కుకుపోయిన ఏపీ వలస కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన మేరకు విమానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు జగన్‌ లేఖ రాశారు. వలస కార్మికుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయలను వెనక్కి రప్పించేందుకు ‘వందేభారత్‌’ మిషన్‌ పేరుతో చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులు దీన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారని తెలిపారు.

* కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు అక్కడే నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే, సెలవుల్లేకుండా రాత్రింబవళ్లు పనిచేసిన సిబ్బందికి కాస్త విశ్రాంతి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 2000 మంది (20 కంపెనీలు) కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌) తమ రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని అభ్యర్థించింది.