ట్విటర్ లాక్‌డౌన్ నేపథ్యంలో సంచలన విషయం ప్రకటించింది. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా తమ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేందుకు (వర్క్ ఫ్రం హోం) అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన ఆంక్షల నేపథ్యంలో తమ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ చేసేందుకు మార్చిలో తొలిసారి అనుమతించింది. అప్పటి నుంచి చాలా మంది ఇంటి నుంచే వారి సేవల్ని అందిస్తున్నారు. ఇది సత్ఫలితాలిస్తుండడంతో భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు
ట్విట్టర్ ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లనవసరం లేదు
Related tags :