ఆలియా భట్… తండ్రి మహేశ్ భట్ కూతురిగా బాలీవుడ్‌కు పరిచయమైనా.. అనతి కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సినిమా సినిమాకు తన నటను మెరుగుపరుచుకుంటూ చిన్న వయస్సులోనే బాలీవుడ్లో తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. త్వరలో ఆర్.ఆర్.ఆర్తో తెలుగులో తెరంగేట్రం చేయబోతున్న ఈ భామ ఇష్టాఇష్టాలేంటో…
*** మరచిపోలేని జ్ఞాపకం
నేను జమ్నాబాయ్ నర్సీ స్కూల్లో చదువుకున్నా. ఏ క్లాస్‌లో ఉన్నప్పుడో గుర్తులేదు కానీ… చిన్నప్పుడు రోజూ స్కూలుకెళ్లి బాత్రూంలో నిద్రపోయేదాన్ని. ఓ రోజు టీచరు చూసి.. వారంరోజుల పాటు క్లాసులోని బెంచీలన్నింటినీ తుడవమని పనిష్మెంట్ ఇచ్చారు. ఆ సమయంలో అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది కానీ… ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.
*** పెరుగు ఉండాల్సిందే
చేపలు, రాగి చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, రసగుల్లా, పెరుగన్నం, పెసరపప్పు హల్వా… ఇలా చాలా పదార్థాలు ఇష్టంగా లాగించేస్తా. ఏవి ఉన్నా లేకపోయినా భోజనంలో మాత్రం పెరుగు కచ్చితంగా ఉండాల్సిందే. అది లేకపోతే భోజనం పూర్తయినట్లు అనిపించదు.
*** ఇష్టపడే పెంపుడు జంతువు
మొదటినుంచీ నాకు పిల్లులంటే ఇష్టం. నేను పెంచుకునే పిల్లి పేరు ఎడ్వర్డ్. ఆ ఇష్టంతోనే పెటా నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నా.
*** నిద్రంటే…
నిద్రపోవడమంటే చెప్పలేనంత ఇష్టం. అవకాశం వస్తే.. దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలపాటు హాయిగా నిద్రపోతా. అయితే నాకు చీకటంటే భయం. అందుకే రాత్రుళ్లు కూడా నా బెడ్‌రూంలో లైటు వెలుగుతుంటుంది.
*** అలవాటు
మొదటినుంచీ నాకు డైరీ రాయడం అలవాటు. ఎంత రాత్రయినా సరే.. అలసటగా అనిపిస్తున్నా.. డైరీ రాసుకున్నాకే నిద్రపోతా.
*** ఇష్టమైన నటీనటులు
హీరోయిన్లలో కరీనా, కరిష్మా కపూర్లంటే ఇష్టం. హీరోల్లో షారుఖ్‌ఖాన్, తెలుగులో అయితే ప్రభాస్. బాహుబలి సినిమాలో ప్రభాస్ నటన ఎంతో నచ్చింది. అతడితో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.
*** తీరిక దొరికితే
స్నేహితులతో కలిసి హాయిగా సినిమాలు చూస్తా. ఈ మధ్య అప్పుడప్పుడూ వంటింట్లోకి దూరి ప్రయోగాలూ చేస్తున్నా.
*** కార్లంటే
ప్రస్తుతం నా దగ్గర అయిదు కార్లున్నాయి. ఆడీలోనే క్యూ5, క్యూ7లతోపాటూ ఏ6 మోడళ్లు ఉన్నాయి. అలాగే రేంజ్‌రోవర్ వోగ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ని కొనుక్కున్నా. వీటిల్లో నాకు నచ్చిన దాంట్లో వెళ్తుంటా.
*** ఇష్టపడే ప్రాంతాలు
మొదటినుంచీ నాకు ప్రకృతికి దగ్గరగా ఉండటమే నచ్చుతుంది. అలాంటి ప్రాంతాలనే వెతుక్కుంటా. మనదగ్గర హిమాచల్‌ప్రదేశ్, విదేశాల్లో అయితే… లండన్‌లో గడిపేందుకు ఇష్టపడతా. లండన్‌లోని హైడీపార్కులో హాయిగా జాగింగ్ చేయడం ఓ మజా.