ScienceAndTech

గూగుల్ నెస్ట్‌కు ధన్యవాదాలు

How google nest is saving lives from corona

కరోనా బారిన పడి విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వారిని పర్యవేక్షించేందుకు వైద్య పరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నెస్ట్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం అమెరికాకు చెందిన మౌంట్‌ సినై హెల్త్‌ సిస్టమ్‌, గూగుల్‌ నెస్ట్‌ చేతులు కలిపాయి. వీరి ఆధ్వర్యంలో పలు ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో కెమెరాలను అమర్చారు. ఆ కెమెరాలను ఆసుపత్రిలోని పర్యవేక్షణ గదికి అనుసంధానించారు. కరోనా తీవ్ర ప్రభావానికి గురై వేర్వేరు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పర్యవేక్షణ గది నుంచే కంప్యూటర్‌ తెరలపై చూస్తూ వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ‘ప్రతిసారీ వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించి రోగులకు గదులకు వెళ్లి రావడమంటే కష్టంతో కూడుకున్న పని. పైగా రోగులతో ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. ఇది ఇటు వైద్య సిబ్బందికీ, అటు రోగులకూ ఇబ్బందికరమే. నెస్ట్‌ కెమెరాలు అందుబాటులోకి రావడంతో… ఇక్కడి నుంచే పర్యవేక్షించ గలుగుతున్నాం’ ఆసుపత్రి ప్రతినిధి ఒకరు చెప్పారు.