* కరోనా బాధితుడు పూర్తిగా కోలుకునే వరకూ ఎలాం టి వైద్యపరమైన తదితర చార్జీలనూ వసూలు చేయరాదని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఎయిమ్స్) నిర్ణయించింది.
* ఏపీలో రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 36 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసు లకు గాను 1192 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860.
* ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు పెరగుతున్న కారణంగా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి నుంచి తాడేపల్లి వచ్చే రహదారులను మూసివేయనున్నారు. తాడేపల్లిలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి పురపాలక సంఘం, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం వహించొద్దని అధికారులకు స్పష్టం చేశారు.
* కరోనా లాక్డౌన్ తో ప్రకృతి తన ఆరోగ్యాన్ని తాను మెరుగుగా తీర్చి దిద్దుకుంటున్నదనే వ్యాఖ్యలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నదీనదాలు, తటాకాలు, సముద్రాల్లో కాలుష్యం తగ్గిందనే వార్తలు విన్నప్పుడు, జనావాసాల్లో జంతులోకం సందడి చేసినప్పుడు. ఇప్పుడు ఒకడుగు ముందుకు వేసి జంతులోకం తిరుగుబాటు చేస్తున్నదని కూడా చెప్పుకోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ తరహా సంఘటనే జరిగింది. సాన్‌జోస్ నగరంలోకి సుమారు 200 మేకలు ప్రవేశించాయి. పదండి ముందుకు అంటూ కదం తొక్కాయి. నగరంలో కవాతు చేశాయి.
* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా మారింది. తమిళనాడు వ్యాప్తంగా 9,227 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే కేవలం కోయంబేడు మార్కెట్లోనే 2,600 కేసులు నమోదైనట్లు ప్రత్యేక నోడల్ అధికారి తెలిపారు. కోయంబేడు మార్కెట్లో పని చేస్తున్న కార్మికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అందులో 2,600 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.
* తోపుడు బండిపై భార్య, కూతురును కూర్చోబెట్టి..మధ్యప్రదేశ్‌లోని బాలాకోట్‌కు చెందిన రాము, తన భార్య ధన్వంత (8 నెలల గర్భిణి), రెండేళ్ల కూతురు అనురాగిణితో స్వస్థలానికి పయనమయ్యాడు.అంతదూరం తన భార్య నడిచివెళ్లాలంటే ప్రమాదమని భావించి మార్గమధ్యలో చేతికి దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేశాడు.దానిపై భార్య, కూతుర్ని కూర్చోబెట్టిన రాము వందల కిలోమీటర్లు వారిని తీసుకెళ్లాడు.తినడానికి తిండి లేకున్నా అలాగే తన ప్రయాణం కొనసాగించాడు.రోడ్డున పోయే ఒకరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది.మార్గంమధ్యలో మహారాష్ట్ర పోలీసులు వీరి దయనీయ పరిస్థితిని చూసి సహాయం చేశారు.నితేశ్ భార్గవ అనే పోలీస్ అధికారి వారికి ఆహారం అందించి, వైద్య పరీక్షలు చేయించారు.తర్వాత వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి స్వస్థలానికి తరలించారు.