పాలకొల్లులో మారుతి క్యాంటీన్‌లో దిబ్బరొట్టె స్పెషల్ అందరికీ తెలిసిందే. 40 ఏళ్లుగా క్యాంటీన్‌లో రొట్టెలను వేస్తున్న వేగిరాతి సత్యం సేవలను యూట్యూబ్‌లో చూసిన ఢిల్లీ నేషనల్ డిజాస్టర్ రిసోర్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) డీజీపీ సత్యనారాయణ ప్రధాన్ స్పందించారు. 86 ఏళ్ల వయస్సులో కూడా సత్యం పనిచేయ డం అభినందనీయమని అతనికి ఏదైనా సహాయం చేయాలని గుంటూరు ఎన్‌డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ జాహిద్‌ఖాన్‌కు సందేశం పంపారని ఏఎస్సై బి.భూలోకం తెలిపారు. గుంటూరునుంచి వచ్చిన అధికారులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సత్యంకు క్వింటాలు సోనా రైస్, 50 కేజీల మినపగుళ్లు అందజేశారు. వీటిని అందుకున్న సత్యం మాట్లాడుతూ ఆ అధికారులు తన సేవలకు స్పందించి ఇచ్చిన ఈ కానుకలు తన ఒక్కడికే కాదని హోటల్‌లో పనిచేస్తున్న అందరికీ పంచుతానని ఆనందంతో చెప్పారు. హోటల్ యజమాని మట్టా భాస్కర్‌తోపాటు పలువురు సత్యంను అభినందించారు.
పాలకొల్లు సత్యం దిబ్బరొట్టె
Related tags :