Agriculture

ఏపీ రైతులు ఫుల్ హ్యాపీస్!

Second Round Of Rythu Bharosa Money To Be Deposited Into Andhra Farmers Accounts

రైతు భరోసా పథకం రెండో ఏడాది నిధులను శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49,43,590 మంది రైతులకు నిధులు పంపిణీ చేస్తారు. సాధారణ లబ్ధిదారులు 46,28,767 మంది, చనిపోయిన వారి వారసులు 61,555, వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం కాని వారు 2,12,025, దేవాదాయ భూముల రైతులు 623, అటవీ భూములు సాగు చేసుకునే వారు 40,620 మంది లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.7,500 జమ చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.2వేల పీఎం కిసాన్‌ నిధులు గత నెలలోనే రైతుల ఖాతాలో జమయ్యాయి. మిగిలిన డబ్బులను ఇప్పుడు వేయనున్నారు. పథకానికి ప్రభుత్వం రూ.505 కోట్ల అదనపు నిధులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
Second Round Of Rythu Bharosa Money To Be Deposited Into Andhra Farmers Accounts