తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలోని ‘శ్రీవారి పాదాలు’ పర్యాటక కేంద్రం వరకు ఆర్టీసీ అధికారులు గురువారం ఓ బస్సును ట్రయల్ రన్‌గా నడిపారు. ప్రస్తుతం తిరుమలలో పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. శ్రీవారి పాదాల మార్గం కొన్నిచోట్ల ఎత్తుపల్లాలతో పాటు ఇరుగ్గా ఉండటంతో బస్సులను తిప్పడం లేదు. తాజా ట్రయల్‌రన్‌లో రెండు మలుపుల్లో బస్సులు తిరగడం కష్టమైనట్లు గుర్తించారు. మలుపులు వెడల్పుతో పాటు రోడ్డు బాగు చేస్తే బస్సులు నడిపేందుకు సంసిద్ధత వ్యక్తంచేస్తూ ఆర్టీసీ.. తితిదేకు నివేదిక ఇవ్వనుంది. తిరుమలలో దేవాలయ అవసరాలతో పాటు స్థానికులు, వ్యాపారుల సరకుల రవాణాకు కార్గో సర్వీసులను ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ‘సంఘం లారీల’ ద్వారా ఇక్కడికి సరకు రవాణా జరుగుతోంది. కొంతకాలంగా వీటిని అనుమతించడం లేదు. ● లాక్‌డౌన్ తర్వాత ఆర్టీసీ సీట్ల అమరికలో మార్పు చేస్తోంది. మూడు సీట్లలో ఇద్దరు, 2 సీట్లలో ఒక్కరు, వెనుక వరుసలో ముగ్గురు కూర్చునేలా చూస్తోంది. తిరుపతి-తిరుమల మధ్య ఆర్టీసీ మూడు రకాల బస్సులు నడుపుతోంది. 49 సీట్ల బస్సులో 30 మంది, 47 సీట్లలో 28, 45 సీట్లలో 25 మందిని మాత్రమే అనుమతించనుంది. బస్సుల్లోకి మొదట ఎక్కేవారు చివరి వరుసలో కూర్చునేలా, దిగేటప్పుడు మొదటి సీటులోని వారు ముందు దిగేలా చూడనున్నారు.
తితిదే శుభవార్త!
Related tags :