రాజధాని కోసం అమరావతి రైతులు, మహిళలు 150 రోజులుగా అలుపెరగనిపోరాటం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదురు నిలిచి తట్టుకున్నారని ఆయన కితాబిచ్చారు.
33 వేల ఎకరాల రైతుల భూముల త్యాగాలతో లక్షల కోట్లు సమకూరితే…వైకాపా పాలకులు దాన్ని మట్టిలో కలిపేశారని చంద్రబాబు విమర్శించారు.
ప్రభుత్వ ఆస్తుల అమ్మి బిల్డ్ ఏపీని సోల్డ్ ఏపీగా మార్చేశారని ఆయన దుయ్యబట్టారు.
అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.