Business

APSRTC నుండి 6వేల మంది ఔట్

Jagan Administration Removes 6000 APSRTC Employees

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ షాకిచ్చింది. ఒకేసారి ఆరువేల మందిపై వేటు వేసింది.

ఇవాళ్టి నుంచి విధులకు హాజరుకావొద్దంటూ వారికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు తెలిపారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు కూడా ఇప్పటి వరకు అందలేదు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.

ఆర్టీసీ యాజమాన్యం తీరును ఖండిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ డిమాండ్ చేస్తున్నారు.