కోవిడ్ -19 వలన ప్రభావితమైన అంతర్జాతీయ విద్యార్థులకు తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ (తాల్) నిత్యావసర వస్తువులను గురువారం అందజేసింది. లండన్ లోని ఈస్ట్ హామ్ లో ఈ పంపిణీ చేశారు. తాల్ ప్రతినిధులు రవి మోచర్ల, సత్యేంద్ర పగడాల ఆధ్వర్యంలో తాల్ కార్యకర్తలు వివిధ దేశాలకు చెందిన సుమారు 400 విద్యార్థులకు సహాయం అందించారు. శరవనాభవన్ గ్రూప్ యజమాని శివకుమార్, శరవనాభవన్ (UK) యజమాని రేఖ విక్కి, లండన్ శక్తి స్టోర్స్ యజమాని P.R. సురేష్ కుమార్ ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయం చేశారు. విద్యార్థులు ఈ ఆపద సమయంలో ఆదుకున్నందుకు తాల్ కి కృతజ్ఞతలు తెలిపారు. తాల్ చైర్మన్ సోమిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ సాంఘీక సహాయం ఆందించడానికి తాల్ ఎల్లప్పుడూ ముందంజ వేస్తుందని, కేవలం తెలుగు విద్యార్థులకే పరిమితం కాకుండా, అంతర్జాతీయ విద్యార్థులకు కూడా తోడ్పాటు అందిచామన్నారు. లండన్ లోని మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధమైన సహాయక కార్యక్రమాలు చేపడతామని శ్రీధర్ ఆశా భావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి ఉదారముగా విరాళాలు అందించిన దాతలుకి రవి మోచర్ల కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ విద్యార్థులకు “తాల్” చేయూత
Related tags :