* హైదరాబాదులోని జీడిమెట్లలో ఒక వ్యక్తి వంటిఫై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు, కారణం తెలియలేదు. స్థానికులు మంటలను ఆర్పివేసి ఆవ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
* గుంటూరు జిల్లా గార్లపాడు లో రైతుల మధ్య పొలానికి నీరు పెట్టుకొనే విషయంలో గొడవ జరిగింది ఇరువురు గాయా పడ్డారు.
* విశాఖలో గ్యాస్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
* గుంటూరు జిల్లాలో విధులు సక్రమంగా నిర్వహించని 17 మంది పోలీసులను విఆర్ కు బదిలీ చేస్తూ ఎస్పీ రామకృష్ణ ఆదేశాలు జారీచేశారు.
* ఒంగోలులోని పేర్నమిట్ట సమీపంలో ఉన్న మెడికల్ కంపనిలో మంటలు చెలరేగాయి. ప్రాణనష్టం జరగలేదు.
* నకిరేకల్ గ్రామంలో ఈతకు వెళ్లి ఒక ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి చెందాడు.
* లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవడాన్ని సవాలు చేస్తూ ఒక న్యాయవాది వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఆ న్యాయవాదికి ఒక లక్ష జరిమానా విధించింది.
* కృష్ణాజిల్లా ఆరుగోలనులో ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఫై అదే గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి అత్యాచారం. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు.
* బాపట్ల సమీపం లోని వెదుళ్లపల్లి వద్ద వలస కార్మికులు, తమ రాష్ట్రాలకు తరలించాలని కోరుతూ పెద్దత్తున రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
* ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు గ్రామం వద్ద కరంటు షాక్ తగిలి గత రాత్రి మృతి చెందిన 9 మంది మృతదేహాలకు నేడు పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
జీడిమెట్లలో దారుణం-నేరవార్తలు-05/15
Related tags :