Food

మునగాకు పప్పు చేద్దామా!

Telugu Spicy Dal With Drumstick Leaves-Telugu Food And Diet News

*** కావలసినవి:
మునగాకు: 2 కప్పులు, సెనగపప్పు: కప్పు, కందిపప్పు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, పసుపు: అరటీస్పూను, కారం:2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, జీలకర్ర: అరటీస్పూను, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, ఆవాలు: టీస్పూను, ఎండుమిర్చి:రెండు, కరివేపాకు: 2 రెబ్బలు, చింతపండు: కొద్దిగా, నూనె: టీస్పూను

*** తయారుచేసే విధానం:
పప్పుల్నీ ఆకునీ శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. అందులోనే పసుపు, కారం, రెండు చుక్కల నూనె వేసి మూడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించి ఉంచాలి. చింతపండును ముందుగానే నానబెట్టి గుజ్జులా చేసి, ఇప్పుడు పప్పులో కలపాలి. తరవాత బాణలిలో నూనె వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన పప్పులు, ఆకు వేసి దగ్గరగా ఉడికించి దించాలి.