Devotional

కృష్ణుడికి సూర్యుడికి సాంబారుకి లంకె ఇది

The story of sambar that runs via sun and krishna in hindu mythology

జాంబవతీ,శ్రీకృష్ణుల కుమారుడు సాంబుడు.
ఇతనికి కృష్ణుని కుమారుడిని అని కాస్త గర్వం ఉండేది.
ఒకనాడు నారదుడు ద్వారకకు వచ్చి నప్పుడు నారాదుడిని లెక్క చేయక, నమస్కరించక, పట్టించుకొనలేదు.
నారాదునికి కోపం వచ్చి ‘అడవిలో ఎవరి సహాయము లేక ఒంటరిగా వండుకుని తింటూ జీవించెదవు గాక’ అని శపించాడు.?

అంతట కృష్ణుడు సాంబుడిని పిలిచి నారదుని వేడుకో శాప విమోచనం చెప్తాడు అని నారదుని వద్దకు తిరిగి పంపించాడు?

సాంబుడు తిరిగి నారదుని వద్దకు వచ్చి..ఆయన్ను పొగిడి,ప్రార్ధించి ప్రసన్నం చేసుకొని శాపవిమోచనం అడిగాడు.?

అప్పుడు నారద మహర్షి ఇలా అన్నాడు’ఇక్కడ నుండి దక్షిణ దిక్కుగా వేళ్ళు..అక్కడ నీకు శేషాచల పర్వత ప్రాంతం అనువైనది..అక్కడ నీవు చేసుకునే వంట ను ప్రతిరోజూ సూర్యునికి నైవేద్యంగా పెట్టి నువ్వు భుజించు.
అలా చేస్తున్నప్పుడు ఏరోజైతే నువ్వు సరి కొత్త శాఖాహార పదార్ధాన్ని చేస్తావో, అది స్వీకరించిన సూర్యుడు సంతృప్తి చెందితే నిన్ను ఆయనే ద్వారకకు చేరుస్తాడు..శుభంభుయాత్’ అని ఆశీర్వదించి పంపించాడు.

శాపగ్రస్థుడైన సాంబుడు శేషాచల ప్రాంతానికి చేరాడు.
ఆరోజు నుండి ఆయాన ఉదయాన్నే లేవడం రోజుకో కొత్త వంట చేయడం సూర్యునికి సమర్పించడం..సూర్యునికి సంతృప్తి లేకపోవడం..
ఇలా కొన్నాళ్ళు జరిగాక ..

ఆరోగ్యం సరిగా లేక,కాస్త నలతగా ఉండి ఆయన నీళ్లు ఎక్కువ వేసిన పప్పు ఉడికించి అడవిలో దొరికిన మునగకాయ వేసి..ఇంగువ దట్టించి ఉడికించి వేడి వేడిగా ఒక ద్రవ పదార్ధాన్ని సూర్యునికి నైవేద్యంగా పెట్టాడు.

అంతే

సూర్యుడు ప్రత్యక్షమై పోయాడు.
.(సాంబడిని ద్వారక చేరిస్తే చాలు కానీ ..ఆనందం భరించలేక సూర్యుడే వచ్చేశాడు)

నాయనా సాంబు.. ‘ఇంత వరకూ ఇలాంటి పదార్ధాన్ని చూడలేదు..రుచిలో మహోన్నతం..ఈ దక్షిణా పథంలో నీ పేరు చిరస్థాయి గా ఉండిపోయేలా ఈ పదార్ధానికి నీ పేరే పెడుతున్నా..కలియుగాంతం వరకు ఈ పదార్థం లోకాన్ని అంతటినీ వ్యాపించి నిన్ను స్మరిస్తూ ఉండేలా చేస్తుంది..ఈ రోజు నుండి దీని దివ్య నామం

? ‘సాంబారు’.?

జై సాంబార్??