DailyDose

2157కు చేరిన ఏపీ కరోనా కేసులు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - AP Total Cases Reach 2157

* లాక్‌డౌన్‌తో పని కోల్పోయిన వ‌ల‌స కూలీలు స్వంత రాష్ట్రాల‌కు బాట క‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ఎవ‌రు న‌డుచుకుంటూ వెళ్తున్నారు, ఎవ‌రు వెళ్ల‌డం లేద‌న్న విష‌యాన్ని స‌మీక్షించ‌డం కోర్టుకు కుద‌ర‌ని ప‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. వ‌ల‌స కూలీల న‌డ‌క అంశాన్ని రాష్ట్రాలు డిసైడ్ చేయాల‌ని, దీంట్లో కోర్టు ప్ర‌మేయం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని ధ‌ర్మాస‌నం వినిపించింది.

* లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు తమిళనాడులో మద్యం షాపులను మూసివేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

* ది.15.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :

గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 56 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2157 ,, వైద్య సేవలు పొందుతున్న 857 , డిశ్చార్జ్ అయిన వారు 1252 , మరణించిన వారు 48 .

గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన
కరోనా పరీక్షలు – 9,038
మొత్తం చేసిన పరీక్షలు : 2,19,452
వాటిలో పోసిటివ్కేసులు : 2157 ( 0.983% ) ;
మరణాలు : 48 ( 2.23 % ) .

జిల్లాల వారీగా :
అనంతపురం : కొత్త కేసులు 4 , మొత్తం 122 , చికిత్స పొందుతున్న వారు 62 , డిశ్చార్జి అయిన వారు 56 , మరణించిన వారు 4 ;
( అనంతపురం జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)

చిత్తూరు : కొత్త కేసులు 24 , మొత్తం 165 , చికిత్స పొందుతున్న వారు 88 , డిశ్చార్జి అయిన వారు 77 , మరణించిన వారు లేరు ;
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 13 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)

తూర్పు గోదావరి: కొత్త కేసులు 1 , మొత్తం 52 , చికిత్స పొందుతున్న వారు 17 , డిశ్చార్జి అయిన వారు 35 , మరణించిన వారు లేరు;

గుంటూరు : కొత్త కేసులు లేవు , మొత్తం 404 , చికిత్స పొందుతున్న వారు 139 , డిశ్చార్జి అయిన వారు 257, మరణించిన వారు 8 ;

వైఏస్సార్ కడప : కొత్త కేసులు 2 , మొత్తం 101 , చికిత్స పొందుతున్న వారు 38 , డిశ్చార్జి అయిన వారు 63 , మరణించిన వారు లేరు ;
( కడప జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)

కృష్ణా : కొత్త కేసులు 2 , మొత్తం 351 , చికిత్స పొందుతున్న వారు 134, డిశ్చార్జి అయిన వారు 203 , మరణించిన వారు 14 ;

కర్నూలు: కొత్త కేసులు 8 , మొత్తం 599 , చికిత్స పొందుతున్న వారు 238 , డిశ్చార్జి అయిన వారు 343 , మరణించిన వారు 18 ;

నెల్లూరు : కొత్త కేసులు 14, మొత్తం 140 , చికిత్స పొందుతున్న వారు 56 , డిశ్చార్జి అయిన వారు 81 , మరణించిన వారు 3 ;
( నెల్లూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 8 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వచ్చినవి)

ప్రకాశం : కొత్త కేసులు లేవు , మొత్తం 63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు ;

శ్రీకాకుళం: కొత్త కేసులు 2 , మొత్తం 7 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ;

విశాఖపట్నం : కొత్త కేసులు 2 , మొత్తం 68 , చికిత్స పొందుతున్న వారు 42 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1 ;

విజయనగరం – కొత్త కేసులు 3 , మొత్తం 7 , చికిత్స పొందుతున్న వారు 7 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;

పశ్చిమ గోదావరి : కొత్త కేసులు లేవు , మొత్తం 69 , చికిత్స పొందుతున్న వారు 24 , డిశ్చార్జి అయిన వారు 45 , మరణించిన వారు లేరు ;

ఈ రోజు నిర్ధారించిన 102 కేసుల్లో, 57 ఆంధ్రప్రదేశ్ కు చెందింనవి. మిగిలిన 45 (34 మహారాష్ట్ర, 11 రాజస్థాన్ కు చెందివి)

* లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది పనులు కోల్పోవడంతో వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుంచి నాలుగో విడత ఉచిత రేషన్‌ను అం దించనుంది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన ద్వారా ఒక్కో కార్డుకు కిలో శనగలు, ప్రతి సభ్యుడికి ఐదు కిలోలు బియ్యం అందజేస్తారు. అర కేజీ పంచదారను మాత్రం సబ్సి డీ ధరపై సరఫరా చేస్తారు. పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

* కరోనా పై ఏ.పి. ప్రభుత్వం హెల్త్ బులిటెన్ 155 విడుదల, ఏ.పి.లో 24 గంటల్లో 57 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమెదు, రాష్ట్రంలో 2157 కు చెరిన కరోనా పాజిటివ్ కేసులు, ఏ.పి.లో కరొనాతో ఇప్పటివరకు 48 మంది మృతి, అత్యధికంగా కర్నులు జిల్లాలో 599 కేసులు. విశాఖలో 68 కి పెరిగిన కేసులు.