విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత నౌకాదళం ఆపరేషన్ ‘సముద్ర సేతు’ చేపట్టింది. ఇందులో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకురావడానికి ఐఎన్ఎస్ జలాశ్వ అక్కడికి చేరుకుంది. వివిధ ప్రాంతాలకు చెందిన 518 మంది భారతీయులు అందులో ఎక్కారు. వాతావరణం అనుకూలించకపోయినా గంటకు 40 నాటికల్ మైళ్ల వేగంతో నౌక ప్రయాణిస్తోంది. వారందరినీ కేరళలోని కోచ్చికి తీసుకొచ్చి, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపుతారని నేవీ వర్గాలు తెలిపాయి.
నౌకలో కేరళ వస్తున్న 518మంది ప్రవాసులు
Related tags :