Movies

ఆ “బిగ్‌బాస్”కు ఒక దణ్ణం

Anchor Jhansi On Bigg Boss 4 Show

‘బిగ్‌బాస్ 4’లో అవకాశం వస్తే వెళతారా అంటూ.. యాంకర్స్ ఝాన్సీకి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె సమాధానమిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇంతకు ముందు కూడా ఝాన్సీకి ఈ ప్రశ్న ఎదురైంది. అప్పుడు కూడా ఝాన్సీ ఘాటుగానే స్పందించింది. నాకు అసలు ఆ ‘బిగ్‌బాస్’లోకి వెళ్లాలనే ఆసక్తే లేదంటూ.. ‘‘సీజన్ 1లో ముందు ఆఫర్ నాకే వచ్చింది. అప్పుడే రానని చెప్పా. ఇప్పుడు అస్సలు వెళ్లను. తెలిసి తెలిసి రాయి ప‌ట్టుకొని ఎవ‌రైనా ప‌ళ్లు ఊడ‌కొట్టుకుంటారా? నాలుగు గోడ‌ల మ‌ధ్య న‌న్ను నేను బాధ‌పెట్టుకోవ‌డం నాకు ఇష్టం లేదు..’’ అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.