తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంపై తీవ్ర ఆర్థిక భారం పడింది. కరోనాతో విధించిన లాక్డౌన్తో భక్తులు రాకపోవడంతో దాదాపు రూ.25కోట్ల ఆదాయం కోల్పోయింది. నిత్యం వేలాది మంది భక్తుల రాకతో కోట్ల ఆదాయం వస్తుండేది. అయితే, గత రెండు నెలలుగా ఈ ఆదాయానికి గండిపడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.123కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది దాదాపు 30శాతం ఆదాయం తగ్గే అవకాశం ఉందని ఆలయ ఈవో తెలిపారు.
₹25కోట్లు కోల్పోయిన అన్నవరం దేవాలయం
Related tags :