Politics

సరే…ఎవరినీ తొలగించము!

APSRTC Transportation Minister Perni Nani Clarifies No Job Removal

ఏపీఎస్‌ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న పొరుగు సేవల ఉద్యోగులెవరినీ తొలగించడం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్టీసీలోని ఉద్యోగులందరూ యథాతథంగా విధుల్లో కొనసాగుతారని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,600 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలపై కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఉద్యోగుల తొలగింపు అంశంపై పునఃసమీక్షించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌.. మంత్రి పేర్ని నానికి నిన్న లేఖ రాసింది. దీనిపై మంత్రి ఈ విధంగా స్పందించారు.