NRI-NRT

కర్నూలులో 15టన్నుల సరుకులు పంపిణీ చేయనున్న తానా

Kurnool NRI Foundation And TANA Foundation To Distribute 15Tonnes Of Rice And Dal

మే 17వ తేదీ ఆదివారం నాడు ఏపీలో అత్యధిక కేసులు కలిగిన కరోనా జిల్లాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15టన్నుల పప్పు, బియ్యం తదితర నిత్యావసర సరుకులను స్థానికులకు అందజేయనున్నారు. కర్నూలు నగరం, పాణ్యం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్ హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పంపిణీ చేస్తారని తానా కార్యదర్శి పొట్లూరి రవి ఓ ప్రకటనలో తెలిపారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 20వేలకు పైగా భోజనాలు అందించామని, ఈ నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను తానా ఆధ్వర్యంలో చేపడతామని రవి తెలిపారు.