కాబోయే భర్తతో కలిసి తమ రెస్టారెంట్‌కు వచ్చిన న్యూజిలాండ్ ప్రధానికి చోటు లేదని చెప్పేశారు… ఆ దేశ రాజధాని వెలింగ్టన్‌లోని ‘ఆలివ్’ నిర్వాహకులు! అందుకు ప్రధాని నొచ్చుకోలేదు సరికదా, తమ వంతు కోసం కాసేపు నిరీక్షించారు. న్యూజిలాండ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గడంతో రెండు రోజుల కిందటే దేశంలో ఆంక్షలను సడలించారు. ఈ క్రమంలో కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్‌తో కలిసి ప్రధాని జసిండా ఆర్డెర్న్ శనివారం ఆలివ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే అప్పటికే అక్కడి కుర్చీలన్నీ నిండిపోయినట్టు నిర్వాహకులు చెప్పారు. దీంతో వారిద్దరూ తమ వంతు కోసం కాసేపు నిరీక్షించి, వెనుతిరిగి వెళ్తుండగా… మేనేజర్ ఒకరు పరుగున వెళ్లి సీట్లు ఖాళీ అయ్యాయని చెప్పారు. దీంతో వారు మళ్లీ రెస్టారెంట్‌లోకి వెళ్లారు.
హోటల్‌లో…ప్రధానికే సీటు లేదు
Related tags :