వలస కార్మికులకు సాయం చేయడానికి భిక్షాటన చేస్తానని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఆయన లాక్‌డౌన్ సమయంలో ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్ ద్వారా పేదలకు వివిధ రూపాల్లో సాయం చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయాలు, ఆహారం పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది నిరాశ్రయులకు తన ఫాంహౌస్‌లో ఆశ్రయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న సొమ్ము అయిపోతోందని ఇటీవల ఆయన ట్వీట్ చేశారు. ‘నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినా సరే లోన్ తీసుకునైనా పేదలకు సాయం చేయడం కొనసాగిస్తా. కావాలంటే నేను మళ్లీ సంపాదించుకోగలను’ అని పేర్కొన్నారు.
బిచ్చమెత్తి అయినా సేవ చేస్తా
Related tags :