కరోనా బారిన పడకుండా ఉండేందుకు చేతులు శుభ్రంగా ఉంచుకుంటాం. అలాగే బయట నుంచి తెచ్చిన వస్తువులను కూడా నీటితో కడిగి మరీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. ఇలా చేతులతో తాకే ప్రతి వస్తువును శానిటౌజ్ చేస్తున్నాం. మరి అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన మేకప్ కిట్లను శానిటైజ్ చేస్తున్నారా? చేయకుంటే బ్యూటీ ప్రాడక్ట్స్, మేకప్ కిట్లను వెంటే శుభ్రపరిచేయండి. ఎలా అంటే.. ఇలా ఒక్కొక్కటిగా ఎంచుకోండి?
1. పౌడర్, పాలెట్స్
పౌడర్ డబ్బాలు, మేకప్ పాలెట్స్ అన్నింటినీ పట్టుకొని డబ్బాలకు శానిటైజ్‌ను స్ప్రే చేయాలి. తర్వాత వాటిని గాలికి ఆరబెట్టాలి. ఇలా చేస్తే మామూలు స్థితికి వస్తుంది.
2. మేకప్ బ్రెష్
మేకప్ బ్రెష్‌లు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ పట్టుకొని మృదువైన కాటన్ ప్యాడ్ ఉపయోగించి బ్రెష్‌ను శుభ్రం చేసి ఆరబెట్టాలి. బ్రెష్‌లను శానిటైజర్‌తోనే కాకుండా తేలికపాటి షాంపూలతో కూడా శుభ్రపరుచవచ్చు.
3. లిక్విడ్ ఫౌండేషన్
కాటన్ ప్యాడ్‌ను శానిటౌజర్‌లో ముంచి ఫౌండేషన్ బాటిల్ మూత దగ్గర బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల అక్కడున్న బ్యాక్టీరియా నశించిపోతుంది.
4. పెన్సిల్, షార్పెనర్
ముందుగా ఒక గిన్నెలో శానిటౌజర్ వేసి అందులో షార్పనర్ వేయాలి. తర్వాత తీసి పొడి కాటన్ ప్యాడ్‌తో శుభ్రంగా తుడిచిపెట్టాలి. ఈ పని ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది.
మేకప్ కిట్స్, బ్యూటీ ప్రాడక్ట్స్‌ను ఎలా శుభ్రపరచాలో ఇప్పుడు తెలిసింది కదా. మరేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పని స్టార్ట్ చేసేయండి.