అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి అస్ట్రేలియా మాజీ సారధి స్టీవ్ వాను బ్యాటింగ్ లెజెండ్లలో ఒకరిగా పరిగణిస్తారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయి అత్యుత్తమ కెప్టెన్లలో ఆయన ఒకరని అందరూ అంగీకరిస్తారు. అయితే తనతో ఇప్పటివరకూ ఆడిన ఆటగాళ్లందరిలో స్టీవ్ వా అత్యంత స్వార్ధపరుడంటూ… ఆస్ట్రేలియాకే చెందిన మరో దిగ్గజం షేన్ వార్న్ సంచలనాత్మక వ్యాఖ్య చేశాడు. స్టీవ్ వా కు ఉన్న రనౌట్ రికార్డే ఇందుకు రుజువని కూడా వార్న్ అంటున్నాడు. స్టీవ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో రనౌట్ భాగస్వామి అయిన 104 సందర్భాల్లో అధికంగా, అంటే 73 సార్లు వా భాగస్వామే బలయ్యాడు… అంటూ క్రికెట్ విశ్లేషకుడు రాబ్ మూడీ, ఆ మొత్తం దృశ్యాలు కలిగిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఓ గంట నిడివి గల ఈ వీడియోను తయారు చేసేందుకు తనకు 24 గంటలు పట్టిందంటూ అతను తెలిపాడు. ఈ అంశంపై ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ స్పందిస్తూ… ‘‘నాతో ఆడిన ఆటగాళ్లందరిలో అత్యంత స్వార్ధపరుడు స్టీవ్. ఇదే విషయాన్ని నేను 1000 సార్లు చెప్పాను… రికార్డుల కోసం మళ్లీ చెప్తున్నాను. స్టీవ్ వా అంటే నాకేమీ ద్వేషం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అతనిని నేను ఇటీవలే ‘ఆల్ టైమ్ బెస్ట్ ఆస్ట్రేలియన్ టీమ్’కు ఎంపిక చేసుకున్నాను.’’ అని వ్యాఖ్యానించాడు. 1999 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తన చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై విజయం సాధించి, ప్రపంచ కప్‌ను ఎగరేసుకుపోవటంలో స్టీవ్ వా పాత్ర గణనీయమైనది. ఈ అస్ట్రేలియా స్కిప్పర్ సామర్థ్యంపై ఎవరికీ ఏ అనుమానాలు లేవని… అయతే అతని పేరున ఉన్న రనౌట్ గణాంకాలు చంద్రునిలో మచ్చలాగా పరిణమించాయని పలువురు క్రికెట్ పరిశీలకులు అంటున్నారు.
వీరిద్దరి మధ్య ఏదో జరిగింది!
Related tags :