?కరోనా కష్టకాలంలో పేదలకు సాయం చేస్తున్న కోటంరెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం దారుణం…
?అధికారుల అనుమతితో భౌతిక దూరం పాటిస్తూ నిబంధనల ప్రకారం నడుచుకుంటుంటే కేసులు పెడతారా…
?సొంత ఖర్చుతో సాయం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఫొటో ఉంటే అధికారులకు, అధికార పార్టీకి అభ్యంతరమేంటి..
?లక్ష కుటుంబాలకు సాయం చేశామని చెబుతున్న ఒక ఎమ్మెల్యే బియ్యం సంచులపై ఫొటోలేసుకోవచ్చా..
?జిల్లా ఉన్నతాధికారులను ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు మాట్లాడినా చూస్తూ ఊరుకుంటారా..
?అధికార పార్టీ నేతలపై ఎందుకు కేసులు పెట్టరు..వారిని అదుపుచేసే పరిస్థితి లేకుండాపోయింది….
?ఉత్తపుణ్యానికి కోటంరెడ్డిపై కేసు పెట్టడం అన్యాయం..
?అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి…లేదంటే ప్రజాగ్రహం తప్పదు..
?కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నిరంతరం జనం మధ్యలో ఉంటూ జనం కోసం పనిచేసే నాయకుడు..ఇలాంటి నాయకుడిపై అక్రమ కేసులు తగదు…
?అధికార యంత్రాంగమంతా వైసీపీ నేతల చెప్పుచేతల్లో చేరి వ్యవస్థను గాలికొదిలేసే పరిస్థితి రావడం దురదృష్టకరం..