Business

మరణంతో పాటు వచ్చే సంపద

The real asset that comes with you after death

ఒక వ్యాపార వేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని,
చాలా కస్టపడి సుమారు వెయ్యి కోట్లు రూపాయిలు సంపాదించాడు.

ఒకరోజు ఆ వ్యాపార వేత్త తాను ఎంతో కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన ధనం, తాను చనిపోయినా సరే ఎవరికీ, ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని, బాగా ఆలోచించి, పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు

ఏమని అంటే.. ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువైన సలహా ఇస్తారో వారికి పది కోట్లు ఇస్తానన్నాడు.

నెల గడిచినా ఎవరు రాలేదు. అప్పుడు మల్లీ వంద కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో, చిక్కి సగం అయిపోయి ఉండగా..

ఒక రోజు ఒక జ్ఞాని వచ్చి… నేను మీ డబ్బు మీకు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువైన సలహా చెపుతాను అని అన్నాడు..

అప్పుడు ఆ వ్యాపార వేత్త.. ఎలా..? అని ప్రశ్నించాడు…

దానికి ఆ జ్ఞాని ఆ వ్యాపార వేత్త తో.. మీరు అమెరికా, ఇంగ్లండ్, జపాన్ వెళ్ళారా..? అని అడిగాడు..

దానికి ఆ వ్యాపార వేత్త.. హా.. వెల్లాను అని చెప్పాగా..

అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేశారు అని జ్ఞాని అడిగాడు..

దానికి ఆ వ్యాపార వేత్త.. మన భారతదేశ నోట్లు అమెరికాలొ చెల్లవు కనుక నా రూపాయలను డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను, అదే ఇంగ్లండ్ ఆయితే పౌండ్ గా, జపాన్ ఆయితే యన్స్ గా.. ఇలా ఏదేశం వెళ్తే, ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి, తీసుకొని వెళ్తాను అని అన్నాడు..

అప్పుడు జ్ఞాని ఇలా చెప్పాడు…

ఓ కోటీశ్వరుడా…! అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా, నీడబ్బు నీతో రావాలంటే, నీవు వెల్లాలని నిర్ణయించుకున్న దేశం లాగా.. ఒకవేళ నీవు నరకానికి వెల్లాలి అని అనుకుంటే నీడబ్బును పాపము లోనికి మార్చు. అంటే దుర్వినియోగం, చెడు వ్యసనాలకి, పాపపు పనులలోనికి మార్చు.

లేదా… ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే, నీ డబ్బును దాన, ధర్మములు చేసి పుణ్యంగా మార్చుకో.. అని చెప్పగానే.. ఆ ధనవంతునికి జ్ఞానోదయం కలిగి, ఆ జ్ఞానిని వంద కోట్లు తీసుకోమంటాడు.

దానికి జ్ఞాని.. నేను కస్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు. అప్పుడు జ్ఞానోదయం ఆయిన ఆ ధనవంతుడు, తన ఆస్తికి ఆ జ్ఞానినే నిర్వాహకుడి గా నియమించి, తగినంత జీతం తీసుకోమని చెప్పి, తన సంపద అంతా సన్మార్గంలోనికి, పుణ్యం లోనికి, జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా.. పాత పాప కర్మలు పరివర్తనతో నశించి, మంచి కర్మల వలన పుణ్య గతులకు వెళ్తాడు..

ఇదండీ… మానవుని సంపద మానవునితో వచ్చే విధానం..

మనం కష్టపడి సంపాదించినది.. మంచి ధర్మ మార్గం లో ఖర్చు చేసి, పుణ్యం గా మార్చి మనతో తీసుకొని వెల్దామా.. లేక… ఇక మన ఇష్టం…