DailyDose

ఏపీలో తాజాగా 48కేసులు-TNI కరోనా బులెటిన్

TNILIVE Corona Bulletin-48 New Cases In Andhra

* ఏపీ అగని కరోనా కల్లోలం.తాజా హెల్త్ బులిటెన్ 156 రిలీజ్ చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.ఏపీలో కొత్త‌గా శనివారం 48 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు.ఇప్పటివరకు రాష్ట్రంలో 2205 కి చేరిన పాజిటీవ్ కేసులు.గడచిన 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు, నెల్లూరు, కర్నూల్ జిల్లా లో 9 చొప్పున కేసులు నమోదు.కృష్ణా 7, చిత్తూర్ లో 8, విశాఖలో 4, కడప లో 1, వెస్ట్ గోదావరి లో 1 చొప్పున కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదు.అత్యధికంగా కర్నూలు జిల్లాలో 608 కేసులు, గుంటూరు 413, కృష్ణా జిల్లాలో 367 కేసులు నమోదు.కరోనా పాజిటివ్ తో 1353 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌.వివిధ ఆసుపత్రుల్లో 803 మందికి కొనసాగుతున్న చికిత్స.గడిచిన 24 గంటల్ 9628 శాంపిల్స్ పరీక్ష.ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వారు 49.ఇతర రాష్ట్రాల కు చెందిన కరోనా పాజిటివ్ కేసులు 150.

* లాక్‌డౌన్‌ సడలింపులపై ఏపీ సర్కార్‌ మరోసారి ఆదేశాలు జారీచేసింది. వ్యవసాయ పనులకు ఆటంకాలు కలిగించవద్దని అధికారులను సూచించింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, క్రయవిక్రయాలకు ఆటంకాలు ఉండొద్దని తెలిపింది. కూలీల రవాణా, విత్తనాలు, ఎరువుల అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు మినహా ఎక్కడా అంతరాయం కలగనీయరాదని తెలిపింది. వ్యవసాయ యంత్ర పరికరాలు, మరమ్మతుల దుకాణాలు ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు తెరిచే ఉండేలా అనుమతిచ్చింది. దుకాణాల వద్ద గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. వ్యవసాయ సంబంధిత కేంద్రాల్లో సిబ్బందికి పాసుల జారీపై ప్రభుత్వం పలు సూచనలు చేసింది.

* తమిళనాడులో కరోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. 24గంటల్లోనే 477 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క చెన్నై నగరంలోనే 332 కొత్త కేసులు వచ్చాయి. కొత్తగా ముగ్గురు మరణించడంతో మరణాల సంఖ్య 74కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10585కి పెరిగింది.

* కేరళలో కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో త్రిస్సూర్‌లో 4, కొలికోడ్‌ 3; పాలక్కడ, మలప్పురంలలో రెండేసి చొప్పున కేసులు నమోదైనట్టు వైద్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆమె తెలిపారు.

* లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కలిశారు. దిల్లీలోని సుఖ్‌దేవ్‌ విహార్‌ ఫ్లైఓవర్‌ వద్ద వారిని కలిసి ఇబ్బందులను తెలుసుకున్నారు.

* దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. 24గంటల్లోనే 438 కొత్త పాజిటివ్‌ కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. దీంతో దిల్లీ నగరంలో మొత్తం కేసుల సంఖ్య 9333కి చేరాయి. ఇప్పటివరకు 129మంది ఈ వైరస్‌ బారిన పడి మరణించగా.. 3926మంది కోలుకున్నారని వైద్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది.