Politics

సుధాకర్ మతిభ్రమణానికి ముఖ్యమంత్రే కారణం

Chandrababu comments on vizag doctor sudhakar's condition

విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్ పై దాడిని ఖండించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు

నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి

– ఫోన్లు చేసి బెదిరించిన వారిని, దాడి చేసినవారిని తక్షణమే అరెస్ట్ చేయాలి

– సుధాకర్ కు అత్యున్నత వైద్య చికిత్స అందించాలి

విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్ రావు పై దాడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖండించారు.

ఈ దురాగతానికి నైతిక బాధ్యత సీఎం జగన్ దే. విశాఖలో దళిత వైద్యుడిపై దాడి అమానుషం.

సభ్య సమాజం తలదించుకునేలా చేస్తారా..? చేతులు కట్టేయడం, లాఠీలతో కొట్టడం హేయం.

ఇది దళితులపై దాడి, వైద్యవృత్తిపై దాడి. ప్రశ్నించే వ్యక్తులందరినీ హింసిస్తారా..? రాజ్యాంగాన్నే అపహాస్యం చేస్తారా..? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఫాసిస్ట్ పాలనలో ఉన్నామా..?

రాజ్యాంగం, చట్టాలు రాష్ట్రంలో లేవా..? అదేమని ప్రశ్నిస్తే దారుణంగా హింసిస్తారా..?

డాక్టర్ సుధాకర్ ఈ పరిస్థితికి సీఎం జగనే కారణం.

ఒక వైద్యుడిని ఈ పరిస్థితికి తెచ్చినందుకు సిగ్గుపడాలి.

తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికే డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేశారు.

మాస్క్ లు అడిగిన వైద్యుడిని సస్పెండ్ చేసిన చరిత్ర దేశంలోనే లేదు.

దళితుల పట్ల జగన్ కు ఉన్న చిన్నచూపుకు సుధాకర్ ఉదంతమే ఉదాహరణ.

దళితుల పట్ల జగన్ దుర్మార్గాలను ప్రతిఒక్కరూ ఖండించాలి, వైసిపి ప్రభుత్వ దుర్మార్గాలను అందరూ గర్హించాలి.

సుధాకర్ రావుకు తక్షణమే అత్యున్నత వైద్యం అందించాలి. ఆయనకు మళ్లీ పూర్తి స్వస్థత చేకూరేలా చూడాలి.

డాక్టర్ సుధాకర్ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలి.

డాక్టర్ సుధాకర్ కాల్ లిస్ట్ విశ్లేషించాలి. ఎవరెవరు ఆయనను వేధించారు, బెదిరించారో విచారణ చేయాలి. డాక్టర్ ను బెదిరించిన వారి పేర్లు వెల్లడించాలి.

ఈ దుర్ఘటనకు కారకులైన నిందితులపై తక్షణమే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.