NRI-NRT

ట్రంప్‌పై ఒబామా విమర్శలు

Obama Slams Trump At Graduation Ceremony

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌నితీరుపై ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ప‌రోక్ష విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్‌ సెరిమనీలో పాల్గొన్న ఒబామా.. అమెరికాలో నల్లజాతీయుల‌పై జరుగుతున్న దాడులు, కరోనా వైర‌స్ కార‌ణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులు త‌దిత‌ర‌ అంశాలపై మాట్లాడారు.

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింద‌ని, 75,000 మందికి పైగా అమెరికన్‌ల ప్రాణాలు తీసింద‌ని, ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో పాల‌కులు విఫ‌ల‌మ‌య్యార‌ని ఒబామా విమ‌ర్శించారు. 

క‌రోనా కార‌ణంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో చాలా మంది త‌మ గురించి తామే గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌ని, అయితే వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావ‌డంలేద‌ని ట్రంప్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు.

ప్ర‌స్తుత‌ విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు విధులు నిర్వ‌హించ‌డం కాదుక‌దా, క‌నీసం విధులు నిర్వ‌హిస్తున్న‌ట్లు న‌టించ‌నైనా న‌టించ‌డం లేద‌ని ఒబామా ఫైర్ అయ్యారు.

ఏండ్లు గ‌డుస్తున్నా న‌ల్ల‌జాతీయుల‌పై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంద‌న్న ఒబామా.. ఫిబ్రవరి 23న జార్జియాలో 25 ఏండ్ల‌ అహ్మద్‌ ఆర్బెరీని కాల్చిచంపిన ఘటనను గుర్తుచేశారు.