వేసవి ఎండల నుంచి బయట పడాలంటే ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారా.. వంటింట్లో అందుబాటులో ఉండే పుట్నాల పప్పుతో చక్కని పానీయం తయారుచేయొచ్చు. నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ పానీయం తక్షణ శక్తినిస్తుంది.
కావాల్సినవి: పుట్నాల పప్పు – కప్పు, చక్కెర – రెండు పెద్ద చెంచాలు, నీళ్లు మూడు కప్పులు.
తయారీ: వేయించిన పుట్నాల పప్పును పిండి చేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. చిటికెడు ఉప్పు, చక్కెర వేసి మరోసారి బాగా కలపాలి. అరముక్క నిమ్మరసం పిండాలి. చివరగా పుదీనా వేసుకుని తాగితే సరి. ఈ షర్బత్ నుంచి మాంసకృత్తులు, పీచు, ఖనిజాలు అందుతాయి. చలవ చేస్తుంది కూడా.
పుట్నాల పప్పుతో షర్బత్
Related tags :